కరోనా కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. రోజు రోజుకి స్వామి వారిని దర్శించుకునే ఆన్లైన్ భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోందని టిటిడి బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.