భారతదేశంలో రాజకీయాలకు పునాదివేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగచోరంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బలమైన బీజేపీ పార్టీ ని ఎదుర్కోవాలి. అయితే ఏవిధంగానూ బీజేపీ ని ఓడించే సత్తా మాత్రం ఇప్పటి కాంగ్రెస్ కు లేదు. దీనితోడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లకు, కొత్తవారికి పడకపోవడం తద్వారా వర్గ విభేదాలు వారి స్టామినా ని రోజు రోజుకి తగ్గిస్తున్నాయి..  పార్టీ లోని సీనియర్ నేతలకు, రాహుల్ గాంధీ వర్గానికి అస్సలు పడడం లేదని ముందునుంచి తెలుస్తున్న మాట.. సీనియర్ నేతలు దీన్ని సోనియా గాంధీ కి చెప్తున్నా ఆమె పట్టించుకోకపోవడంతో వారికి కోపం మరింత ఎక్కువై అప్పట్లో ఇంట్లో విషయాన్నీ బజారున పడేశారు..