కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో రాజకీయం క్రమంగా వేడెక్కుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామాలు ఇప్పుడు చాలా వరకు ఇబ్బందిగా మారాయి అని చెప్పవచ్చు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీ చాలా వరకు బలహీనంగా ఉంది. అయినా సరే అక్కడ ఏవీ సుబ్బారెడ్డి మాజీ మంత్రి అఖిల ప్రియ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం  ఇప్పుడు ఆందోళనకర స్థాయిలో ఉంది. 

 

ఎప్పుడు అయితే భూమా నాగిరెడ్డి మరణించారో అక్కడి నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మద్య వాతావరణం చాలా ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన జిల్లాలో వ్యక్తమవుతుంది. అసలు ఫ్యాక్షన్ అనేది ఈ మధ్యలో ఎప్పుడు కూడా జిల్లాలో కనపడలేదు. ఇప్పుడు ఎక్కడ మొదలవుతుందో అని జిల్లా వాసులు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: