అనంతపురం జిల్లాలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరమీదకు తెస్తున్నారన్నారు టీడీపీ యువనేత జేసి పవన్ కుమార్ రెడ్డి. ఆయన ఆదివారం ఒక ఛానల్ తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. తన చిన్నాన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని కడప జిల్లా జైలుకు పంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 

 

న్యాయమూర్తి అనంత జైలు లేదా తాడిపత్రి జైలుకు పంపాలని చెప్పినప్పటికీ దాదాపు 5వందల కి.మీ. పైగా అనంత పోలీసులు 70ఏళ్ల వయసు కలిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పంపించారు అని... అంటే వారికి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి అనేది అర్ధమవుతుందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకు అనంతపురం వన్ టౌన్ పోలీస్టేషన్‌లో ఉంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: