ఈఎస్ఐ కుంభకోణం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అర్ధరహితం అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.  తాను అసలు ఎక్కడికి పారిపోలేదు అని ఇంట్లోనే ఉన్నా అని ఆయన స్పష్టం చేసారు. తనను వైసీపీలోకి రావాలి అని కోరారు అని కాని తాను రాను అని చెప్పా అని అందుకే ఈ విధంగా కక్ష గట్టి తనను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

 

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చాలి అని ఆయన డిమాండ్ చేసారు ఈ సందర్భంగా. కాగా అచ్చెన్న తో పాటుగా ఈయన పాత్ర కూడా ఉంది అనే ఆరోపణలు వచ్చాయి. దీనితో ఏసీబీ అధికారులు పితాని మీద కూడా దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: