హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన 10 మందిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకే నిఘా పెట్టి దాడి చేశామని జూబ్లీహిల్స్ సీఐ సత్తయ్య తెలిపారు.

ఇళ్లను, ప్లాట్లును అద్దెకు తీసుకొని పేకాట క్లబ్లుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని వారి ఆధార్కార్డు జిరాక్స్, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే రెంట్కు ఇవ్వాలని సూచించారు. తమచుట్టుపక్కల ఇలా అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నట్టు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పేకాటను రాష్ట్రంలో నిషేధించారని పేర్కొన్నారు. అయితే పేకాట స్థావరంలో అరెస్టు అయిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా పేకాటరాయుళ్ల నుంచి మొత్తం 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: