న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతగల పోలీసు ఉద్యోగంలో ఉంటూ ఓ సీఐ అవినీతి పాల్పడ్డాడు. తప్పును కప్పిపుచ్చడానికి ఖరీదైన నాజూకు చరవాణీ(స్మార్ట్ఫోన్)ని లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌ పోలీస్స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న పల్లె రాకేశ్ గౌడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 80వేల రూపాయల ఖరీదైన సెల్‌ఫోన్ను లంచంగా తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. సాజిద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశాడు. కాగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. శనివారం మధ్యాహ్నం సీఐని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. అదే క్రమంలో రాకేష్ గౌడ్ మరో సివిల్ కేసులో లంచం తీసుకుంటూ దొరకిపోయాడు. అతని అదుపులోకి తీసుకుని.. అతడి ఇంట్లో, కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బోదన్ సీఐగా ఉన్న ఇతను గతంలో నిజామాబాద్ నగరంలో ఎస్సైగా పనిచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: