ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ మీడియాతో మాట్లాడారు. ఏపీ తొలిదశ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషదాయకం అని హర్షం వ్యక్తం చేసారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా,ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందని ఎన్నికల కమీషన్ భావిస్తోంది అన్నారు. 

ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో, నిబంధనలతో పనిచేయడం సంతోషాదాయకం అని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల నిర్వహణ సవాల్ గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు అని ఆయన అన్నారు. పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను అని తెలిపారు. తొలిదశ ఎన్నికలలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీ,ఎన్నికల పరిశీలకులు పూర్తి సమన్వయంతో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలు ఇచ్చింది అని తెలిపారు. రెండవ దశ ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: