సకాలంలో వర్షాలు పడాలంటే ప్రకృతి దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని, అందుకోసం కప్పలకు పెళ్లి చేసి విందు భోజనం పెట్టడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఇలా రెండు కప్పలకు పెళ్లి చేసిన ఘటన త్రిపురలో జరగగా అది కాస్త వైరల్ గా మారింది. ఆచారాల ప్రకారం రెండు కప్పలకు నదిలో స్నానం చేయించి కొత్త బట్టలు వేసి, సింధూర సైతం దిద్దించారు. అలాగే ఈ తంతులో దండల మార్పిడి కూడా చేయించడం విశేషం. పాటలు పాడుతూ త్రిపురలో ఒక గ్రామంలో ఇలా కప్పల పెళ్లి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: