సచివాలయ ఉద్యోగులు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉద్యోగులు ఇకపైన సచివాలయాలకు నిర్ణీత సమయాలకు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే సచివాలయాల నుంచి కూడా ఇంటికి సరైన సమయంలోనే తిరిగి వెళ్లాలని, ఇందులో ఎక్కడ తేడా వచ్చినా కూడా వారి జీతాలలో కోత విధించే విధంగా ఆదేశాలను జారీ చేశారు. సచివాలయాలకు ఉద్యోగులు ఆలస్యంగా వస్తే మాత్రం వారి జీతంలో కోత విధించే విధంగా నిర్ణయించింది. పండుగ తర్వాత నుంచి ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం.
ఇప్పటికే సచివాలయాలకి ఉన్న పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల పేరుతో ఏపీ ప్రభుత్వం పేర్లను మార్చింది. ఇప్పుడు వారి పనితీరులలో కూడా పూర్తిస్థాయిలో మార్పులను చేపట్టేలా ఆదేశాలని జారీ చేసింది. ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఫేషియల్ అటెండెన్స్ నిబంధన విధించారు. అయితే ప్రస్తుతం రీ సర్వే కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలలో మాత్రం ఈ అటెండెన్స్ యాప్స్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించారు. అలాగే ఫీల్డ్ లో పని చేస్తున్న వారి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఈ యాప్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలియజేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి