గత కొద్దిరోజులుగా కోలీవుడ్ నటుడు ధనుష్,మృణాల్ ఠాకూర్ మధ్య ఏదో సంబంధం నడుస్తోంది అనే ప్రచారం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది మృణాల్ ఠాకూర్ నటించిన హిందీ మూవీ కి ధనుష్ గెస్ట్ గా వెళ్ళిన సమయం నుండి వీరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలా మృణాల్ ఠాకూర్ బర్త్డే కి కూడా ధనుష్ ని ఆహ్వానించడంతో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని వీరి మధ్య ఈ బాండింగ్ ఎక్కడిది.. నిజంగా ఓ సినిమాలో వీరు కలిసి నటించారంటే అప్పటి నుండి ఫ్రెండ్షిప్ మొదలైంది అనుకోవచ్చు. కానీ ఇప్పటివరకు వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటిది వీరి మధ్య అంత రిలేషన్ ఎక్కడినుండి ఊడిపడింది అని చాలామంది ఆశ్చర్యపోయారు.

 అంతేకాదు ఇండస్ట్రీలో అయితే జస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. మరీ ఇలా బర్త్ డే లకు పిలుచుకోవడం,ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం వరకు వచ్చిందంటే వీరి మధ్య యవ్వారం ఎక్కడికో వెళ్లిపోయింది అంటూ చాలామంది ఊహగానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు తాజాగా కొంతమంది అయితే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా మృణాల్ ఠాకూర్, ధనుష్ లు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కాస్త వైరల్ గా మారింది. అయితే తాజాగా ధనుష్ మృణాల్ ఠాకూర్ లకు సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 ఆ ఫోటోలో ధనుష్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు ఒకే రూమ్ లో నుండి బయటికి వస్తున్నట్టుగా చీకట్లో ఫోటోలు తీసినట్టు అర్థమవుతుంది.అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఇదేంటి వీరిద్దరూ అంత రహస్యంగా హోటల్ రూమ్ లో కలుసుకున్నారు.వీరిమధ్య ఎలాంటి రిలేషన్ లేకపోతే అలా హోటల్ రూమ్లో ఉండడం ఏంటి అని షాక్ అయిపోతున్నారు. ఇక మరి కొంతమందేమో ఇది సినిమాలోని సీనా.. లేక వీరి మధ్య వచ్చే రూమర్లను నిజం చేస్తున్నారా అంటూ పోస్టులు పెడుతున్నారు.మరి వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఓ కొత్త సినిమా ఏదైనా రాబోతుందా.. లేక నిజంగానే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: