దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అలా యాక్టివ్ గా ఉంటూనే ఒక్కోసారి ఒక నెటిజన్ ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక సాధారణ నెటిజన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. దేశం కోసం సేవలందిస్తున్నాము ఒక కుర్ర డాక్టరు ట్విట్టర్లో ఎకౌంట్ తెరిచారు. అయితే అందులో తన సొంత పేరు పెట్టుకోకుండా డెక్స్ట్రో కార్డియాక్ అనే యూజర్ నేమ్ తో చలామణి అవుతున్నారు. 

ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అజిత్ దత్త అనే ఒక జర్నలిస్ట్ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాక డెక్స్ ట్రో దివాస్ అని పేర్కొన్నారు. ఆ విషెస్ కు స్పందించిన సదరు డాక్టర్ థాంక్యూ చెబుతూనే మిమ్మల్ని ప్రధాని మోడీ ఫాలో అవుతూ ఉంటారు కదా... ఆయన నాకు శుభాకాంక్షలు చెప్పేలా చేయండి అని కోరాడు. ఆసక్తికరంగా ఈ ట్వీట్ చూసిన మోడీ ఆయనకు హ్యాపీ బర్త్ డే చెబుతూ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: