మాన్సస్ ట్రస్ట్ లో ఆడిటింగ్ మొదలయింది.2004, 2005 సంవత్సరం నుండి అధికారులు ఆడిటింగ్ మొదలు పెట్టారు.భూములు ఇతర  వాటిపై అడిట్ మొదలు పెట్టినట్లు జిల్లా ఆడిటింగ్ అధికారి హిమబిందు తెలిపారు.మాన్సస్ ట్రస్ట్ లో మొత్తం  27 మంది అధికారులతో ఆడిటింగ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. నాలుగు టీమ్ లుగా విభజించి ఆడిటింగ్ చేస్తున్నామని ఆడిటర్ హిమబిందు తెలిపారు. మాన్సస్ ట్రస్ట్ లో నెల రోజులకు పైగా ఆడిట్ జరుగుతుందని ఆమె తెలిపారు.గత ఈవో గా పని చేసిన కె.రామచంద్ర మోహన్ మాన్సస్ భూముల విషయంలో అవకతవకలు ఉన్నాయని వాటిపై కమిటీ సభ్యులుగా నియమించారు. అందులో భాగంగా రికార్డులను పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు. రికార్డులు పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆర్జేసి భ్రమరాంబ తెలిపారు.మాన్సస్ ట్రస్ట్ పై ప్రభుత్వం దృష్టి సారించింది.2004 నుండి ట్రస్ట్ లో ఆడిటింగ్ జరగలేదు.అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఆడిటింగ్ ని అధికారులు చేపట్టారు.మాన్సస్ లో జరిగిన అవకతవకలను వెలికి తీయలని ప్రభుత్వం భావిస్తుంది.వైసీపీ.ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాన్సస్  ట్రస్ట్ చైర్మన్ గా సంచయత గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు.అయితే ఆమె నియామకం పై అశోక్ గజపతిరాజు హైకోర్టు ని ఆశ్రయించారు .దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అశోకగజపతి రాజుని మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ గా తిరిగి బాధ్యతలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: