భారతీయ జనతా పార్టీ నేత, ఆదిలాబాద్ ఎంపీ అయిన సోయం బాపూరావు కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి విజయం సాధించడం కేసీఆర్ కి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు బాపూరావు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు అనే స్కీం ని తెరమీదకు తెచ్చారంటూ అంటూ వ్యాఖ్యానించారు. 

 ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బిసి మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. దళితులకు 300 ఎకరాల భూమి కూడా లేదంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట ఇచ్చిన ప్రకారం సమస్యలు పరిష్కరించలేదని, దళితుల కి ఇచ్చిన కంప నిధులను టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని వాపోయారు బాపూరావు.  పోడు వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ప్రభుత్వం అనేక ఆటంకాలను కలిగిస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: