రోడ్డుపై ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే వారైనా ప్రమాదం బారిన పడతారు లేదంటే వారి వల్ల ఇతరులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ మహానుభావుడు రోడ్డుపై చేసిన స్టంట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటో పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దీనికి నెటిజనులకు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫోటో లో యువకుడు హెల్మెట్ పెట్టుకుంటే సరి కదా బైక్ హ్యాండ్ పూర్తిగా వదిలేసి రెండు చేతులతో దండం పెడుతూ కనిపించాడు. ఇలాంటి స్టంట్స్ చేయడం సరదాగానే ఉన్నా ప్రమాదాలు తప్పవు. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ "రోడ్డు, ఇతర వాహదారులు, ట్రాఫిక్ పోలీసులు మీద వున్న భక్తి... హెల్మెట్ పెట్టుకోకపోయినా... చేతులు వదిలేసి నడిపినా... అన్నిటికి ఆ దేవుడే దిక్కు అని అనికోవాలేమో..." అంటూ సెటైర్ పేల్చాడు. ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తే పోయేది మన ప్రాణాలు... లేదంటే అవతలి వారివి. జాగ్రత్తలు పాటించమని చెప్పడం వరకే పోలిసుల బాధ్యత, పాటించడం మనవంతు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: