
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ విరామ సమయంలో చిత్రబృందం రిలాక్స్ అవుతోంది. కథానాయకులు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక పిట్ట గోడెక్కి కూర్చొనగా, వారిని కెమెరాలో బంధిస్తూ జక్కన్న ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం వైరలవుతోంది. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబరు 13న విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. అయితే విడుదల తేదీపై మరోసారి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పిట్టగోడమీద కూర్చున్న జూనియన్ ఎన్టీఆర్ ముఖంమీద గాయం కనపడుతోంది. షూటింగ్‌లో భాగంగా దెబ్బ తగిలివుంటుందా? అనేది ఇంకా తెలియలేదు. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన దోస్తీ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంటూ దూసుకుపోతోంది. ఈ పాటను తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో పలువురు గాయకులు ఆలపించారు. తెలుగులో ఉమేష్‌చంద్ర పాడారు.