హైదరాబాద్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక సినిమా షూటింగ్ కు సంబంధించి తీసుకు వచ్చిన జనరేటర్ లో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ జనరేటర్ వాహనం నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అదే వాహనంలో డీజిల్ కూడా లీక్ కావడంతో రోడ్డు పక్కన ఉన్నకారు, ఆ పక్క షాపులకు కూడా మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. అలా షూటింగ్ వాహనానికి దగ్గర, రోడ్డు పక్కన ఆగివున్న హోండా ఐ20 కార్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా ? అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి