స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగింది. ప్రధాన సూచీలు రోజురోజుకీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. మ‌దుపు చేసిన‌వారంద‌రికీ లాభాల పంట పండుతోంది. సెన్సెక్స్‌ 55,000, నిఫ్టీ 16,500 మార్క్‌ను చేరుకున్నాయి. ఉదయం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ సాయంత్రం వ‌ర‌కు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. కీలకమైన‌ రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పైపైకి వెళుతూ ఇన్వెస్ట‌ర్ల‌కు సిరులు కురిపించాయి. ఆసియా మార్కెట్లలో కొద్దిరోజులుగా ప్ర‌తికూల‌త‌లు కొన‌సాగుతున్నాయి. అయితే ఇవేవీ బుల్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయాయి. తొలి త్రైమాసిక ఫలితాలు బాగుండ‌టంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఆశ‌లు రేకెత్తాయి. వీటికి తోడు  పారిశ్రామికోత్పత్తి బాగుండ‌టం వంటి కారణాలు కూడా సుచీలు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో  సెన్సెక్స్‌ 593 పాయింట్లు లాభ‌ప‌డింది. నిఫ్టీ 164 పాయింట్లు ఎలాభ‌ప‌డింది. డాలరుతో పోలిస్తే ఈరోజు రూపాయి విలువ రూ.74.27 వ‌ద్ద ఉంది. సోమ‌వారం ఉద‌యం కూడా ఈ త‌ర‌హా జోరే బుల్ చూపించ‌వ‌చ్చ‌ని స్టాక్‌మార్కెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag