అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై కేసీఆర్ సర్కార్ పుల్ క్లారిటీ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బందికి వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు ఇప్పటి వరకు చెల్లిస్తున్న మొత్తానికి మరో 30 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంగన్వాడీ టీచర్ల వేతనం 10 వేల 500 రూపాయలు నుంచి 13 వేల 650 రూపాయలకు పెంచింది. అలాగే మినీ అంగన్వాడీ టీచర్లకు 6 వేల రూపాయల నుంచి 7 వేల 800 రూపాయలకు పెంచింది. పెంచిన వేతనాలు గత నెల... జులై ఒకటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీతాల పెంపునకు సంబంధించి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు ఎంతో కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. ఇప్పటికే ధర్నా చౌక్ వద్ద ఆందోళన కూడా చేపట్టారు. తక్కువ వేతనం వస్తున్న నేపథ్యంలో దానిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది సంబరాలు జరుపుకుంటున్నారు. అంగన్వాడీల అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: