సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు కోసం పోరుబాట కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రంలో పంట పొలాలు కౌలుకు చేసుకునే పరిస్థితులు కూడా లేవని, పెట్టుబడి వ్యయం రెట్టింపైందన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలు నిలిచిపోయాయని ప్రభుత్వంపై మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మూతపడటంతో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. రైతులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతుల సగటు రుణభారం దేశంలోనే మొదటిస్థానంలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడమంటే మైనార్టీలకు జగన్మోహన్‌రెడ్డి ద్రోహం చేసినట్లేనన్నారు. మైనార్టీల భూమి కబ్జాకు ప్రయత్నించిన తిరుపాల్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని, విద్యుత్తు ఛార్జీల పెంపుతో జగన్ రెడ్డి ప్రజలపై పెనుభారం మోపారన్నారు. ఇప్పటికే 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.9 వేలకోట్ల భారం వేశారని, ఆరోసారి మరో రూ.2,542 కోట్లు పెంచి మొత్తం 11,500 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారన్నారు. కమీషన్ల కోసం అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలుచేసి ఆ భారాన్ని లు ప్రజలపై మోపుతున్నారన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి