పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి గడువు ఆదాయపు పన్ను శాఖ మళ్లీ పొడిగించింది, ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటన విడుదల చేసింది, దాని గడువు ఆరు నెలలు పొడిగించగా 31 మార్చి 2022 వరకు పొడిగించారు. నిజానికి లింక్ చేయడానికి గడువు 30 సెప్టెంబర్ 2021 అని ముందు చెప్పారు, అయితే COVID-19 మహమ్మారి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికి,ఈ  సమయ పరిమితిని పొడిగించామని, ఇది వారికి సులభతరం చేస్తుందని CBDT తెలిపింది. దీనితో పాటు, ఆదాయపు పన్ను శాఖ చట్టం కింద జరిమానా విధించే తేదీని సెప్టెంబర్ 30, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించారు. ఇంకా, బినామీ ప్రాపర్టీ లావాదేవీల నిషేధ చట్టం, 1988 ప్రకారం అడ్జుడికేటింగ్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేయడానికి మరియు ఉత్తర్వులు జారీ చేయడానికి గడువు 2022 మార్చి వరకు పొడిగించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: