రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగల సమయంలో ప్రైవేట్ బస్సుల దందా ఒక రేంజ్ లో ఉంటుంది. జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రవాణా శాఖ వెంకటేశ్వర రావు ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దసరా సీజన్ లో ట్రావెల్స్ టికెట్ రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామని అన్నారు. 100 బస్సులపై టాక్స్ ఎగవేత తో పాటు వివిధ కేసులు రాసామని తెలిపారు. ఆన్లైన్ లో అధిక ధరల అమ్మకం పైనా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

టికెట్ ధరల పెంపు పై ఇంకా ఎటువంటి కేసులు పెట్టలేదు అని వ్యాఖ్యలు చేసారు. ప్రయాణికులు జిల్లా రవాణా అధికారులకు ఫిర్యాదు చెయ్యవచ్చని అన్నారు. రాష్ట్రం 700 బస్సులు ఉన్నాయి....కోవిడ్ తో ప్రైవేటు బస్సుల ఆపరేషన్స్ తగ్గాయి అని తెలిపారు. ట్రావెల్స్ వెబ్సైట్ లో టికెట్ ధరల మానిటరింగ్ చేస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap