ఇవాళ హైద్రాబాద్ లో కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశం జ‌రుగుతోంది. సింగ‌రేణి కాల‌నీలో అత్యాచారం గురై, త‌రువాత పాశ‌వికంగా హ‌త్య‌కు గురైన చిన్నారి చైత్ర కుటుంబాన్ని ఆయ‌న ఆదుకున్నారు. రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు అందించి, సంబంధిత బాధిత కుటుంబాన్ని  ఓదార్చారు. అదేవిధంగా మున్ముందు తాను అండ‌గా ఉంటాన‌ని అన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు. తెలంగాణ‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఆయ‌న శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. అదేవిధంగా హుజురాబాద్ ఎన్నిక‌కు సంబంధించి పార్టీ వ్యూహాన్నీ స్ప‌ష్టం చేయ‌నున్నారు. అదేవిధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకొన్ని కీలక సూచ‌న‌లు చేయ‌నున్నారు. ప‌వ‌న్ ప్ర‌సంగం ప్రారంభిస్తూ, తెలంగాణ పోరాట అమ‌ర వీరుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.వీరు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. తొలుత జిల్లాల నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న ప‌ల‌క‌రించి, వారికి అభివాదం చేశారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు  రూపొందించిన ప్ర‌త్యేక వీడియోను వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: