ప్ర‌పంచ‌క‌ప్ టీ-20 భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓట‌మి చెందిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా టీమిండియా ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను మాజీ క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. దుబాయ్ వేదిక‌గా అక్టోబ‌ర్ 24న భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా.. భార‌త బ్యాట్స్‌మెన్‌లు  అనుకున్న‌దానికంటే 20 -25 ప‌రుగులు త‌క్కువ చేశారు. పాక్ బౌల‌ర్ షాహిన్ వేసిన బంతుల‌ను రోహిత్‌శ‌ర్మ‌, కేఎల్‌రాహుల్ ఎదుర్కోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డార‌ని.. ఆ ఇద్ద‌రి ఆట‌గాళ్ల పుట్ వ‌ర్క్ స‌రిగ్గా లేనందువ‌ల్ల‌నే త్వ‌ర‌గా ఔట్ అయ్యార‌ని వెల్ల‌డించాడు.

ఇక పాకిస్తాన్ బౌల‌ర్లు బాగా రాణించార‌ని.. బౌల‌ర్ల‌తో పాటు ఓపెన‌ర్లు రిజ్వానా, బాబ‌ర్ ఆజ‌మ్ అద్భుత‌మైన బ్యాటింగ్‌తో పాక్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించార‌ని స‌చిన్ తెలిపారు. భార‌త్ మాదిరిగానే పాక్ ప్రారంభంలోనే రెండు, మూడు వికెట్లు ప‌డితే ఒత్తిడిలోకి వెళ్లేద‌ని వెల్ల‌డించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జ‌ట్టుతో రెండేళ్ల నుంచి ఎలాంటి మ్యాచ్‌లు ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల భార‌త జ‌ట్టు వారి ఆట‌ను అర్థం చేసుకోలేక‌పోయింద‌ని చెప్పుకొచ్చాడు. ఇక జ‌రుగ‌బోయే మ్యాచ్‌ల‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు త‌ప్ప‌కుండా పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు స‌చిన్ టెండూల్క‌ర్‌.
 


మరింత సమాచారం తెలుసుకోండి: