హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇటీవ‌ల జ‌రిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశానికి   టీఆర్ఎస్ నాయ‌కులు  ఫ్లెక్సీలు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేసిన విష‌యం విధిత‌మే. అయితే అప్పుడే వాటిని తొలగించాలంటూ బీజేపీ పిలుపు మేరకు ఆ పార్టీ నగర నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీని ముట్టడించారు. బుద్ద భవన్ లోని జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి కార్పొరేటర్లు, నాయకులు భారీగా తరలివస్తుండగా పలుచోట్ల పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిన‌దే.  జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారి విశ్వజిత్ ను సస్పెండ్ చేయాలని  బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు కూడ  చేశారు.  

తాజాగా టీఆర్ఎస్ ప్లీనరీ ప్లెక్సీల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ  భారీగా జరిమానాలు విధించింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేతలకు ఫైన్ లు విధిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అత్యధికంగా ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మొత్తం 2 లక్షల 35 వేల జరిమానా, మంత్రి తలసానికి  80 వేల జరిమానా వ‌ర‌కు  జీహెచ్ఎంసీ విధించింది. సర్వర్ అప్ గ్రేడేషన్ తో నేటి నుంచి మళ్లీ చలానాలు వేస్తున్నట్టు  జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్ర‌క‌టించారు. ఏ పార్టీ నాయ‌కులు అయినా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: