ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను  గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.  గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ లో టీడీపీ కార్యాల‌పై జ‌రిపిన దాడులు,  అంతకు ముందు టీడీపీ నేత‌లు   చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించిన  వీడియో ఆధారాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు.  వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించే అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు వెల్ల‌డించారు సీఎం జ‌గ‌న్‌.
అదేవిధంగా నవంబర్ 1  వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్స‌వం  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు సీఎం జగన్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంప‌తులు దాదాపు 45 నిమిషాల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అవార్డుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. దాదాపు 50కి మందికి పైగా ఇవ్వ‌నున్నట్టు వివ‌రించారు.  అదేవిధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిలు గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను గవర్నర్ కు  ముఖ్య‌మంత్రి  వివ‌రించారు.  తనపట్ల తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ కు చెప్పారు. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో నెల‌కొన్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో సీఎం జగన్ చ‌ర్చించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: