ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెద‌పూడిలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. ఉన్న‌ట్టుంటి ఒక్క‌సారిగా మంట‌లు రావ‌డంతో స్థానికులు ఏమి జ‌రిగిందోన‌ని ఆందోళ‌న చెందారు. కొద్ది సేప‌టి త‌రువాత అస‌లు విష‌యం తెలిసింది. పెద‌పూడి సెంట‌ర్‌లో ఉన్న‌టువంటి  సైకిల్ షాపు ద‌గ్దం అయింద‌ని తెలుసుకున్నారు.

చెక్క‌లతో త‌యారు చేసిన ఓ షాపును పెద‌పూడిలో నిర్వ‌హ‌కుడు సైకిల్ షాపుగా న‌డిపిస్తున్నాడు. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా శుక్ర‌వారం విద్యుత్‌షాక్‌కు గురై ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. స్థానికులంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. ఇంత‌సేపు ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణంలో అగ్నిజ్వాల‌లు ద‌ర్శ‌నం ఇవ్వ‌డం ఏమిట‌ని షాక్ నుంచి తేరుకునే లోపే షాపు కాలి బూడిద అయింది. అందులో ఉన్న సామాగ్రి అంత ధ్వంస‌మై  బూడిద‌నే మిగిలింది. దీంతో నిర్వాహ‌కుడు ల‌బోదిబో మ‌ని మొత్తుకుంటున్నాడు. స్థానికులు ఫైర్ ఇంజ‌న్ కోసం ఫోన్ చేసినా అప్ప‌టికే జ‌రిగాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోయిన‌ది. త‌న జీవ‌నాధ‌రం అయిన సైకిల్ షాపు ద‌గ్దం కావ‌డంతో నిందితుడు ఏమి చేయాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకొని ఆలోచ‌న‌లో ప‌డ్డాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: