
బీజేపీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అని అంటారా..? బీజేపీ దేశ ద్రోహులు, అర్బన్ నక్సలైట్లను తయారు చేస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నించిన వాళ్లందరూ దేశద్రోహులు అంటే ఎలా.. కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడని.. ఇష్టం వచ్చిన సొల్లును ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుతున్నారు. ధాన్యం ఎంత కొంటావో చెప్పు అని పేర్కొన్నారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా లేదా అని ప్రశ్నించారు బీజేపీని ముఖ్యమంత్రి.
మేఘాలయా గవర్నర్ సత్యపాల్ దేశ ద్రోహేనా..? బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారు. బీజేపీ దేశ ద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీనా అని ప్రశ్నించారు కేసీఆర్. నిన్న నేను ఎవరి మెడలు ఎవరు వంచాలంటే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. ఇది రైతులకు సంబంధించిన వ్యవహారం.. రైతుల వ్యవహారంలో గత ఏడాది కాలం నుంచి రైతులు సమ్మె చేస్తున్నారు. కేంద్రం తన మొండి వైఖరి వ్యవహరిస్తోంది. రైతుల గోడును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతు చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందా లేదా..? సమాధానం చెప్పే వరకు బీజేపీ నేతలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు కేసీఆర్.