టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో ప‌ర్య‌టించారు.  స్థానిక సంస్థల ఎన్నికల‌లో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్ర‌వారం ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. లోకేష్ వైసీపీ నాయ‌కుల‌ను విమ‌ర్శించారు. నేను మా నాన్న‌లా సాప్ట్ కాదు అని పేర్కొన్నాడు. ఈ త‌రుణంలోనే కుప్పం ల‌క్ష్మీపురం స‌ర్కిల్ వ‌ద్ద ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. నారా లోకేష్ రోడ్డు షోకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఎదురుప‌డ్డారు.

టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో కుప్పంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఈ విష‌యం తెలుసుకున్న పోలీస్ బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం కావ‌డంతో మంత్రి పెద్దిరెడ్డి ఎలాగైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని పావులు క‌దుపుతున్నారు. ఈ త‌రుణంలోనే టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నేత‌లు త‌రుచూ ఒక‌రిపై మ‌రొక‌రూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు చేసుకూనే ఉంటున్నారు. పోలీసులు ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో రెండు వ‌ర్గాల‌ను స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: