ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు మ‌రో కీల‌క మ‌లుపును చోటు చేసుకొంది. అయితే ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. హైద‌రాబాద్‌లో దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.  ఈ కేసులో క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర ఉంద‌ని వివేకా మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి ఇచ్చిన స‌మాచారంతోనే దేవిరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే వివేకా హ‌త్య కేసులో 15 మంది అనుమానితుల పేర్ల‌ను వివేకా కూతురు సునిత సీబీఐకి అప్ప‌గించింది. 15 మంది పేర్ల‌లో దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి పేరు కూడా ఉంది. ఎంపీ అవినాష్‌రెడ్డికి శివ‌శంక‌ర్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడు కావడంతో అత‌న్ని విచారించింది. ద‌స్త‌గిరి ఇచ్చిన స‌మాచారంతో సీబీఐ మ‌రికొంత మందిని అదుపులోకి తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.

మ‌రోవైపు ఈ కేసులో క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధం లేద‌ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్ పాత్ర ఉంద‌ని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే ప‌ద‌వీకి రాజీనామా చేస్తాను అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఎప్పుడైనా, ఎక్క‌డైనా తాను డిబెట్‌కు సిద్ధంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు రాచ‌మ‌ల్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: