ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రోజురోజుకు వేడి ఎక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవ‌లే అసెంబ్లీలో టీడీపీ అధినేత క‌న్నీరు పెట్టిన విష‌యం విధిత‌మే. అయితే ఇవాళ ఉద‌యం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. దానికి కౌంట‌ర్‌గా వైసీపీ మంత్రి కొడాలి నాని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసారు. భార్య‌ను అల్ల‌రి పాలు చేసుకుంటున్న చంద్ర‌బాబు ప‌చ్చి రాజ‌కీయ వ్య‌భిచారి అని ఆరోప‌ణ‌లు చేసారు.

 పది మందిని మా ఇంటికి పంపితే నేను ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటాడేమిటని కొడాలి వాపోయారు. నేను సెక్యూరిటీ పెంచుకోను అని నేను వదిలేస్తాను ఆయ‌న‌ను జడ్ ప్లస్ సెక్యూరిటీ వదిలేయమనండి అని పేర్కొన్నారు. అదేవిధంగా  జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటి..? చంద్రబాబు శిష్యులు మాట్లాడే దానికి కంట్రోల్ చేశారా  అన్నారు. నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు కూడా గౌరవం ఉంటుందని, వాళ్లు అమాయకులు అని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారని గుర్తు చేసారు.  గొర్రె కసాయి వాడినే న‌మ్ముతుందని, చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తార‌ని  నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి కొడాలి నాని  వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: