2022 సంవ‌త్స‌రానికి పండుగ‌లు, సెల‌వుల తేదీల‌ను  తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ది. దీనికి  సంబంధించిన జీవోను  కూడా  ఇప్ప‌టికే జారీ చేసింది. 2022 ఏడాదిలో పండుగలు, ఇతర సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన‌ది. వచ్చే  సంవ‌త్స‌రం 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులను గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేసారు.

 నెగోషియబుల్  ఇన్‌స్ట్రూమెంట్‌ యాక్ట్‌ ప్రకారం.. 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు. అందులో ముఖ్యమైనవి సెలవులు జనవరి 1 నూతన సంవత్సరం, జ‌న‌వ‌రి 15 సంక్రాంతి, జ‌న‌వ‌రి 26 గణతంత్రదినోత్సవం, మార్చి 1 మహాశివరాత్రి,  మార్చి 18 హోళీ, ఏప్రిల్‌ 2 ఉగాది, ఏప్రిల్ 10 శ్రీరామనవమి,  ఏప్రిల్ 14 అంబేడ్కర్‌ జయంతి,  ఏప్రిల్ 15 గుడ్‌ఫ్రైడే, మే 3, 4 రంజాన్‌, ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవం, సెప్టెంబర్‌ 25 బతుకమ్మ ప్రారంభరోజు, అక్టోబరు 5 విజయదశమి, అక్టోబ‌ర్‌ 9 మిలాద్‌-ఉన్‌-నబి,  అక్టోబ‌ర్ 25 దీపావళి, డిసెంబర్‌ 25 క్రిస్మ‌స్ పండుగా వెల్ల‌డించారు. అయితే వారాంతపు సెలవు దినం అయిన ఆదివారం రోజున‌ ఆరు సెలవు దినాలు రావడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: