త‌మిళ‌నాడులోని  కున్నూర్ వ‌ద్ద జ‌రిగిన‌ హెలికాప్ట‌ర్  ప్ర‌మాదం వ‌ద్ద‌ వింగ్ క‌మాండర్ భ‌ర‌ద్వాజ్ ఆధ్వ‌ర్యంలో బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు. ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. దాదాపు ప‌ది కిలోమీట‌ర్ల దూరంలోనే వెల్లింగ్ట‌న్ బేస్ క్యాంపు ఉన్న‌ది. పొగ‌మంచు ద‌ట్టంగా ఉండ‌డంతో కింద‌కి దిగాల‌ని చూసారు. ఊటీ స‌మీపంలో ఉన్న టీ తోట‌ల్లో ప‌డేలా చూసారు. చెట్ల‌ను త‌గిలడం మూలంగానే హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

భ‌ర‌ద్వాజ్ ఆధ్వ‌ర్యంలో 50 మంది  ఇండియ‌న్‌ ఎయిర్‌ఫోర్స్ అధికారులు సెర్చ్ చేప‌ట్ట‌డం మొద‌లు పెట్టారు. ముఖ్యంగా ప్ర‌మాదం జ‌రిగిన అర‌కిలోమీట‌ర్ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు, పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ చేస్తున్నారు. గ‌తంలో విమాన ప్ర‌మాదాలు, హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. రెండు రౌండ్ల పాటు తిరిగి.. పొగ‌మంచు రావ‌డంతోనే చెట్ల‌ను ఢీ కొట్ట‌డంతో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించి ప్ర‌మాద చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. బ్లాక్ బాక్స్‌లో ఆధారంగానే ప్ర‌మాదంపై పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి. బ్లాక్ బాక్స్ సెర్చింగ్ చేప‌డుతున్న త‌రుణంలో ఎవ‌రినీ కూడా అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ఆర్మీ అధికారులు ఇప్ప‌టికే ఆదేశాలు కూడా జారీ చేసారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: