హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న‌టువంటి  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో ఓ లారీ ఇవాళ‌ బీభత్సం సృష్టించింది. అక‌స్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో లారీ  బైకును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో విజ్ఞాన్‌ కళాశాలలో చదువుతున్న ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్కడికీ అక్కడే మృత్యువాత పడ్డాడు.  అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఆలయ ప్రహరీని ఢీ కొట్టి ఆ లారీ నిలిచిపోయిన‌ది.

 అయితే మృతి చెందిన విద్యార్థి సిరిసిల్లలోని ప్రగతి నగర్కు చెందిన ప్రణయ్ గౌడ్గా గుర్తించారు. ప్రణయ్ విజ్ఞాన్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడ‌వ‌ సంవత్సరం చదువుతున్నాడు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు  ఇంజినీరింగ్ విద్యార్థి ప్రణయ్ ప్రాణాలను బలితీసుకున్న‌ది.  ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని  ప్రమాదం జ‌రిగిన విధానంపై ప‌రిశీలించారు. లారీని  అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: