ఖ‌మ్మం న‌గ‌రంలోని ఓ జంక్ష‌న్ అభివృద్ధి సంద‌ర్భంగా రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తన నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఖ‌మ్మం న‌గ‌రంలో ముత్యాల‌మ్మ గుడి, చ‌ర్చీ కంపౌండ్ ఏరియా ప్రాచుర్యం పొందిన ఆ జంక్ష‌న్‌లో మంత్రి అజ‌య్ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌న‌మ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

ముఖ్యంగా ఈ సెంట‌ర్‌లో భారీ శిలువ‌ను గాని, లేదంటే ఏసుక్రీస్తు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు తాజాగా మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆ ప్రాంతాల్లో ప‌లు నిర్మాణ ప‌నుల‌ను కూడా మొద‌లు పెట్టారు. డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఆ జంక్ష‌న్‌లో నిర్మించే శిలువ లేదా ఏసుక్రీస్తు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాల‌ని నిర్ణ‌యించారు మంత్రి. ఇదిలా ఉండ‌గా.. ముత్యాల‌మ్మ సెంట‌ర్‌, లేదా చ‌ర్చీ కంపౌండ్ ఏరియాలో ప్రారంభించిన క‌ట్ట‌డం వివాదంగా మారుతుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ల‌కు చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ త‌రుణంలో  మంత్రి పువ్వాడ ఏమి చేస్తార‌నేది వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: