జగన్ సర్కారు టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చింది. మరో టీడీపీ నేతను అరెస్టు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గత అర్థరాత్రి 11.15 గంటలకు సీఐడీ పోలీసులు అరెస్టు చేసారు. ప్రమోషన్ కోసం అశోక్ బాబు తన విద్యార్హతను తప్పుగా చూపించారన్నది అశోక్‌బాబుపై మోపిన నేరాభియోగం.. అశోక్ బాబుపై గతంలోనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 477 (ఎ ), 466, 467, 468, 471, 465, 420, ఆర్‌డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐడీ పోలీసులు చెబుతున్నారు.
అయితే.. అశోక్‌బాబును అర్థరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ ప్రశ్నిస్తోంది. అర్థరాత్రి నోటీసులు ఇచ్చి.. అప్పటికప్పుడు అరెస్టు చేశారంటూ అశోక్‌బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారన్న చంద్రబాబు.. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు విమర్శించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి