సినిమా షూటింగ్‌లో హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు.. లాఠీ అనే సినిమా షూటింగ్‌లో ఓ బాలుడిని రక్షించే సన్నివేశంలో రియల్ స్టంట్స్ చేయబోయిన హీరో విశాల్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ సినిమా షూటింగ్ ఆపేసి.. ఆయన హుటాహుటిన చికిత్స కోసం కేరళ వెళ్లారు.
ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా త్వారా అభిమానులతో పంచుకున్నారు విశాల్. ఆయన కేరళలో చికిత్స చేయించుకుని కొన్నిరోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.


తాను విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నానని ఆయన తన పోస్టులో తెలిపారు. మళ్లీ మార్చి మొదటి వారంలో లాటీ సినిమా తుది దశ షెడ్యూల్‌లో పాల్గొంటానంటూ ఆయన తన పోస్టులో వివరించారు. ఈ షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో విశాల్‌ చేతి ఎముకలకు దెబ్బ తగిలినట్లు సమాచారం వస్తోంది. ఆయన పోస్టు చేసిన వీడియోలో ఓ పోలీసు అధికారిగా విశాల్ కనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న లాఠీ సినిమాకు ఎ. వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: