కేంద్ర ప్రభుత్వం మరోసారి యూట్యూబ్ ఛానళ్లపై కొరడా ఝుళిపించింది. ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తున్న పలు చానళ్లను క్లోజ్ చేసింది. భారత దేశ భద్రత, విదేశీ సంబంధాలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న 16 యూట్యూబ్‌ ఛానళ్లును కేంద్రం మూసేసింది. వీటితో పాటు ఒక ఫేస్‌బుక్‌ ఖాతాను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసింది. ఈ యూట్యూబ్ ఛానళ్లలో పాకిస్థాన్‌ నుంచి నిర్వహిస్తున్న 6 యూ ట్యూబ్‌ ఛానళ్లు కూడా ఉన్నాయి. అయితే.. ఇలా క్లోజ్ చేసిన యూట్యూబ్ ఛానళ్లకు 68 కోట్ల మంది వ్యూయర్స్ ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ఛానళ్లన్నీ  ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయని కేంద్రం అంటోంది. అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇవి ప్రయత్నిస్తున్నాయట. ఈ సామాజిక మాధ్యమాలు ఇలా తప్పుడు ప్రచారం ఇండియాకు ప్రమాదకరమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: