విడదల రజని.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. వైసీపీలో ఉన్న మహిళా నేతల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ.. పార్టీ గళం వినిపిస్తుంటారు. ఇటీవల మంత్రి వర్గ మార్పుల్లో ఆమెకు అవకాశం లభించింది. తాజాగా ఆమె ఓ ఘటనలో శభాష్ అనిపించుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.


అసలేమైందంటే.. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొంది. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ సమావేశం కోసం సెక్రెటేరియట్‌కు వెళ్తున్న మంత్రి విడదల రజిని ఆ ప్రమాద ఘటనను చూసి చలించారు.


అంబులెన్స్‌ వచ్చే వరకు అక్కడే ఉండి మంత్రి విడదల రజని బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో  బాధితులను విడదల రజని గుంటూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌ను మంత్రి విడదల రజని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: