పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనతో జయశంకర్ సార్‌ సొంత గ్రామం అక్కంపేట వార్తల్లోకి వచ్చింది. ఈ గ్రామం ఇంకా రెవెన్యూ విలేజ్‌ కాలేదు.. ఇప్పటికీ జయ శంకర్ సారు సొంత ఊరు అక్కంపేట.. పక్కనే ఉన్న పెద్దాపూర్ రెవెన్యూ విలేజ్ పరిధిలోనే కొనసాగుతోంది. అంతే కాదు..
ఆ గ్రామంలో పలు కుటుంబాలకు సొంత ఇళ్లు లేవు. మరో దారుణమైన  విషయం ఏంటంటే.. ఆ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదట. ఆ గ్రామానికి మంచి నీళ్లు అందించేదుకు వీలుగా మిషన్ భగీరథ పనులను తక్షణమే ప్రారంభించాలని స్థానికులు కోరుకుంటున్నారు. పల్లె ప్రగతితో ఎన్నో అద్భుతాలు సృష్టించామంటున్న నాయుకులు సాక్షాత్తూ జయశంకర్ సార్ సొంత గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో సార్  పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. జయశంకర్ సార్ ఊరును ఓ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దితే అది తెలంగాణకు గౌరవంగా నిలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: