రాహుల్ గాంధీని ఈ డీ విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విచారణలో అసలు విషయం ఏమో కానీ.. ఈడీ అధికారులకు రాహుల్ గాంధీ ఓ సీక్రెట్ చెప్పారట.. రాహుల్ గాంధీ ఈడీ ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పడం చూసి వారు ఆశ్చర్యపోయారట. మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తోందని రాహుల్ గాంధీని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌గాంధీ చెప్పారు.

విచారణ చివరిరోజు ఈడీ అధికారులు రాహుల్‌తో.. రాహుల్‌జీ మా ప్రశ్నలకు చాలా ఓపికతో సమాధానం ఇచ్చారు కదా.. అన్ని ప్రశ్నలు విని సమాధానం బాగా ఇచ్చారు. అంతే కాదు.. వాటిని సరిచూసుకున్నారు... మరి మీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారట. అందుకు రాహుల్ గాందీ.. ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా...? 2004 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్నాను కదా.. మాకు ఓపిక రాకుంటే ఏమొస్తుంది అని చెప్పారట. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారట. కాంగ్రెస్‌ పార్టీ మమ్మల్ని అలిసిపోనివ్వదని... రోజూ ఓపిక నేర్పిస్తుందని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: