తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలు ఇవాళ విడుదల కాబోతునత్నాయి. ఇవాళ ఉదయం 11.15 గంటలకు తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలు చేస్తున్నారు.  జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలువిడుదల చేస్తారు. ఈ మేరకు  కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


పాలిటెక్నిక్‌ పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్‌ ర్యాంకులను కూడా ఇవాళే విడుదల చేయనున్నారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాది చేరేందుకు నిర్వహించిన ఈసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 12గంటలకు విడుదల చేస్తారు. ఈ మేరకు ఈసెట్ ఫలితాలపై కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను eamcet.tsche.ac.in, ecet.tsche.ac.in తదితర వెబ్‌సైట్లలో విద్యార్థులు చూసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: