మహిళలపై లైంగిక వేధింపులకు, వారి దుస్తులకు సంబంధించి కేరళ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లైంగిక వేధింపుల కేసుపై కేరళ కోర్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళ రెచ్చగొట్టేలా ధరించారని.. అందుకే ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసు నిలవదని కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు ఇవ్వడం వివాదాస్పదం అయ్యింది. ఈకేసులో కోర్టు నిందితుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు కూడా చేసింది.

శరీర భాగాలు కనిపించేలా దుస్తులు ధరించిన ఫిర్యాదుదారు ఫొటోలను నిందితుడు సమర్పించినందువల్ల సెక్షన్‌ 354 ఎ అంటే లైంగిక వేధింపులు ఇక్కడ వర్తించదని జడ్జి అన్నారు. బాధితురాలి ఆరోపణలు నమ్మశక్యంగా లేవన్నారు. ఐపీసీ సెక్షన్‌ 354-ఎ(2), 341, 354 ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకోవాలన్న మహిళ ఫిర్యాదుపై విచారించిన కేరళ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కోజికోడ్ తీర్పు ఉత్తర్వులపై కేరళ మహిళా కమిషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోజికోడ్‌ కోర్టు తీర్పు సమాజానికి తప్పుడు సందేశం పంపుతుందని కేరళ మహిళా కమిషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: