బియ్యం ఎగుమతులపై ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బియ్యం ధరలు ఆకాశాన్నందున కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతి బియ్యం కాకుండా ఇతర బియ్యంపై 20శాతం ఎగుమతి సుంకం విధిస్తోంది. బియ్యం నూకల ఎగుమతులపైనా కేంద్రం నిషేధం విధించింది. దేశీయ మార్కెట్లో ఆహార ధాన్యాల కొరత వచ్చే అవకాశం ఉన్నందువల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


దేశీయ మార్కెట్‌లో బియ్యం కొరత రాకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్‌ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరిన నూకల ఎగుమతులను మాత్రం ఆంక్షల పరిధి నుంచి మినహాయించింది. గోదాముల్లో గోధుమలు, బియ్యం నిల్వలు తగ్గాయని ఇటీవల వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలను అధికారులు కూడా అంగీకరిస్తునత్నారు. గోధుమ నిల్వలు 14ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. బియ్యం నిల్వలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు గణనీయంగా తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: