గొప్పల కోసం చెప్పుకున్న అబద్దం ఆ తల్లీ కొడుకుల ప్రాణాలు తీసేసింది. విశాఖలో సంచలనం రేకెత్తించిన తల్లి కొడుకుల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తన దగ్గర బోల్డంత డబ్బు ఉందని గొప్పలకు పోయిన మహిళ చివరకు.. ఆ అబద్దాల కారణంగానే హత్యకు గురయింది. దువ్వాడ పీఎస్ పరిధిలో ఈ నెల 8న జరిగిన జంట హత్యల కేసులో అనేక మలుపులు తర్వాత  మదీనా బాగ్ కు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.


గౌరమ్మ అనే మహిళ నడిపే కర్రీ పాయింట్ కు తరచూ వచ్చి ఆమె గురించి ఆరా తీసిన సలి వెందుల చైతన్య, మందకిషోర్ దోపిడీకి పక్కాగా ప్లాన్ చేశారు‌‌. గౌరమ్మ ఎప్పుడూ తన వద్ద 30 లక్షల నగదు ఉందని.. ప్లాట్ కొనుక్కుంటామని గొప్పలు చెప్పేది. ఆ మాటలు నిజమే అనుకున్న చైతన్య, కిషోర్ లు డబ్బు కాజేసేందుకు హత్యకు తెగబడ్డారు. కానీ చంపేసిన తర్వాత ఆమెవద్ద నుంచి కేవలం 2 వేలు నగదు మాత్రమే దొరికింది. కొంత గిల్టు బంగారం దొరికింది. నిందితుల వద్ద నుంచి రెండు బుల్లెట్ వాహనాలు, 2వేల నగదు గిల్టు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: