తెలంగాణకు ఏపీ షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ గురించి ప్రశ్నించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏపీ కోరింది. ఏపీ ఈఎన్ సీ ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడాన్ని ఆంధ్రప్రదేశ్‌ తప్పుబడుతోంది.


గతంలోనూ కృష్ణాబేసిన్ లో  తెలంగాణా నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్  ఫిర్యాదు చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టునూ నిర్మించేందుకు వీల్లేదని  ఏపీ అంటోంది. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ ను కేఆర్ఎంబీకి సమర్పించినట్టుగా 2022 సెప్టెంబరు 3 తేదీన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణా చెప్పిందని ఏపీ గుర్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని తెలియచేసేందుకు డీపీఆర్ కాపీ ఇవ్వాలని కేఆర్ఎంబీని ఏపీ కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: