పోలీసుల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అసోసియేషన్ కు,రాజకీయాలెందుకని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. వైకాపా నేతలందరికో నోరెత్తని పోలీస్ సంఘం తెదేపా నేత చెంగల్రాయుడు చిన్నమాట జారితే, నోరు పెగులుతుందేంటని టీడీపీ నేత వర్ల రామయ్య  ప్రశ్నించారు. సీఐ ఎదురురొమ్ముపై చెయ్యేసి నెట్టి, బూతుపురాణం విప్పిన మంత్రి సీదిరి అప్పలరాజుపై మీరు నోరు పెగల్చలేదేంటని టీడీపీ నేత వర్ల రామయ్య నిలదీశారు.


కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి హెడ్ కానిస్టేబుల్ ను కొట్టి, ముద్దాయిలను బయటకు తీసుకెళ్లిన ఎంపీసురేశ్ పై మీనోరు పెగల్లేదేమని టీడీపీ నేత వర్ల రామయ్య  ఆగ్రహం వ్యక్తం చేసారు. నాకాళ్లు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చా అని సీఐని బూతులుతిట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే శ్రీదేవిపై మీనోరు పెగల్లేదేమని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. పోలీసుల్ని కొజ్జాలని తిట్టిన అధికారపార్టీ మాజీఎమ్మెల్యే ఆమంచికృష్ణ మోహన్ పై మీనోరు పెగల్లేదేమని టీడీపీ నేత వర్ల రామయ్య  దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: