ఇటీవల నారా లోకేశ్‌, చంద్రబాబులపై బూతులతో విరుచుకుపడిన రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్‌ రెడ్డి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూను టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హైలెట్ చేయడంతో.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో మొత్తానికి సారీ చెప్పేశారు. తమపై అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నందునే తాను అలా మాట్లాడానని, తనను క్షమించాలని రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు.


అనంతపురంలో ఆయన అనుచరులతో కలిసి ర్యాలీగా జిల్లా ఎస్పీని కలవటానికి వచ్చిన చందు, చంద్రబాబు నాయుడు కుటుంబంపై చేసిన  వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. ర్యాలీలో నడవటానికి ఇబ్బంది పడుతున్న చందును ఆయన అనుచరులు బుజాలపై ఎత్తుకున్నారు. మీడియాతో మాట్లాడిన చందు పొంతనలేని విషయాలన్నీ మాట్లాడి.. చివరకు చంద్రబాబు నాయుడు కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: