కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాయలసీమ గర్జన సభ జరగబోతోంది. కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూస్తున్నారు. ఆయన ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రాయలసీమకు సంబంధించిన అన్ని జిల్లాల ప్రజలు నాయకులు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.

రాష్ట్రం మరోసారి విడిపోకూడదు అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సభను నిర్వహిస్తున్న జేఏసీ నాయకులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: