గత ప్రభుత్వంలో తెదేపా నేతలు గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌ పనుల్లో అవినీతి భారీగా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దీనిపై సిఐడి విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపై విచారణ కోరతామని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అంటున్నారు. గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజి పనుల్లో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ కోరనున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. గుంటూరు నగరంలోని పివికే నాయుడు కూరగాయల మార్కెట్ స్థానంలో అధునాతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.


గత ప్రభుత్వ హాయాంలో రాజధాని పేరు చెప్పి గుంటూరు నగర అభివృద్దిని పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివ్రద్ది పనులు జరుగుతున్నట్లు కమిషనర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలో ఆధునిక సౌకర్యాలతో కబేళా ఏర్పాటు చేస్తున్నామని.. టిడ్కో గృహాలకు తాగునీరు, డ్రైనేజి పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపారు. నగరం మొత్తానికి భూగర్భ డ్రైనేజి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: